కాకతీయ, రామకృష్ణాపూర్ : ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటు చోరీ కార్యక్రమాన్ని క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. స్థానిక గద్దె రాగడి అమ్మ గార్డెన్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఓటు చోరీపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం స్థానిక ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో సంతకాలు సేకరించారు. పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు, పిన్నింటి రఘునాథ్ రెడ్డి, సీనియర్ నాయకులు అబ్దుల్ అజీజ్, గాండ్ల సమ్మయ్య, మాజీ వైస్ చైర్మన్ విద్యా సాగర్, సుధాకర్, బానేష్, గోపు రాజం, పనాస రాజు, రాజేష్, సురేందర్, రామ్ సాయి తదితరులు పాల్గొన్నారు.


