- బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకుడు కొట్టే మురళీ కృష్ణ
కాకతీయ, కరీంనగర్ : రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకుడు కొట్టే మురళీ కృష్ణ మండిపడ్డారు. గురువారం కరీంనగర్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ ఘోర పరాజయం తప్పదని, అందుకే రేవంత్ రెడ్డి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఎద్దేవా చేశారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కూడా కాంగ్రెస్ సర్కార్ కోర్టుల్లో హడావిడి చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గందరగోళం సృష్టించినందుకు కాంగ్రెస్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు హైకోర్టు వద్ద మంత్రుల హడావిడి సినిమా హైడ్రామా లాగా మారిందని అన్నారు.


