- తహసీల్దార్ నాగరాజు
కాకతీయ, బయ్యారం : సమాచార హక్కు చట్టం ద్వారా ఏ శాఖ నుంచి అయినా సమాచారం తీసుకునే హక్కు ప్రతి వ్యక్తికి ఉందని బయ్యారం తహసీల్దార్ నాగరాజు అన్నారు. కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశానుసారంగా సమాచార హక్కు చట్టం వారోత్సవాలను జయప్రదం చేయాలని వారు తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో గురువారం గ్రామ అధికారులు, ఆర్ఐ తదితర రెవెన్యూ సిబ్బందితో సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించారు. ప్రజలు సమాచార హక్కు చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజలు కోరిన సమాచారాన్ని అధికారులు నిర్దిష్ట వ్యవధిలో అందజేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ లు సందీప్, జూనియర్ అసిస్టెంట్ లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.


