- మండల స్పెషల్ అధికారి శ్రీనివాస్
కాకతీయ, బయ్యారం : మండలంలో అధికారులు అందుబాటులో ఉండి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా కృషి చేయాలని మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ అన్నారు . మొదటి విడతలో బయ్యారంలో ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు. మొదటి విడతలో భాగంగా గురువారం ఎంపీడీవో కార్యాలయంలో 12 ఎంపీటీసీలకు మూడు సెక్షన్లుగా విభజించారు.
నామినేషన్ల స్వీకరణ గడువు ఈ నెల 9 నుంచి 11 వరకు వరకు అభ్యర్థుల తమ తమ ప్రాదేశిక నియోజకవర్గాలలో రిజర్వేషన్ ఆధారంగా నామినేషన్ పత్రాలను బయ్యారం ఎంపిడిఓ కార్యాలయంలో తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల సిబ్బందికి ఎన్నికలు నిర్వహణ అయ్యేంతవరకు ఎటువంటి సెలవులు ఉండవన్నారు. సిబ్బంది సంబంధిత అధికారులకు అందుబాటులో ఉండాలని కోరారు. మోడల్ కోడ్ కండక్ట్ అమలులో ఉన్నందువల్ల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఎంపీడీవో దైవ దీనం, ఎన్నికల ఆర్వోలు ఉప్పలయ్య, ఉషశ్రీ, కృష్ణ , వీర్వోలు సుగుణాకర్, రమేష్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.


