కాకతీయ, నిఘా ప్రతినిధి : న్యాయం చేయాలని కోరుతూ పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదును పట్టించుకోకపోగా.. ఆత్మకూరు సీఐ సంతోష్‌కుమార్ నానా దుర్భషలాడుతున్నట్లు ఇమ్మడి స్వరూప అనే మహిళ వాపోయింది. తన కొడుకు-కోడలు మధ్య గొడవలు జరుగుతుండగా, విచారణ జరిపి న్యాయం చేయాలని కోరినా పట్టించుకోవడం లేదని స్వరూప ఆరోపించింది. పైగా తప్పంతా తనదే అయినట్లుగా సీఐ మర్యాద ఇవ్వకుండా మాట్లాడినట్లుగా వాపోయింది.
న్యాయం చేయమంటే.. దుర్భాషలాడుతున్నాడు..ఆత్మకూరు సీఐ సంతోష్‌కుమార్‌పై ఫిర్యాదురాలు ఆరోపణలు
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


