కాకతీయ, నేషనల్ డెస్క్: గుజరాత్‌లోని పాలన్‌పూర్‌లో ఓ కస్టమర్ సర్వీస్ నిర్లక్ష్యం కారణంగా తీవ్ర ఆగ్రహానికి గురై, తాను కొన్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను షోరూమ్ ముందు నిప్పంటించిన కలకలం రేపింది. ఈ ఘటన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.
పాలన్‌పూర్ నివాసి సాహిల్ కుమార్ కొద్ది రోజుల క్రితం ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేశాడు. ఇటీవల తను భార్య, కుమారుడితో షాపింగ్‌కు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా, మార్గ మధ్యలో స్కూటర్ స్టీరింగ్ రాడ్ విరిగిపోయింది. అదృష్టవశాత్తూ సాహిల్ నెమ్మదిగా వెళ్తుండడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కానీ ఈ లోపం భవిష్యత్తులో తీవ్రమైన ప్రమాదానికి కారణమవుతుందని సాహిల్ గుర్తించారు.
సాహిల్ తన కుటుంబాన్ని వేరే వాహనంలో ఇంటికి పంపించి, వెంటనే స్కూటర్‌ను నేరుగా ఓలా షోరూమ్‌కు తీసుకెళ్లాడు. అక్కడ సిబ్బంది స్కూటర్ సురక్షితంగా రిపేర్ చేయాలని, లేక తాత్కాలిక ప్రత్యామ్నాయ వాహనం అందించమని అడిగాడు. అయినప్పటికీ, షోరూమ్ సిబ్బంది సాహిల్ అభ్యర్థనను నిర్లక్ష్యంగా తీసుకున్నారు. వారు రిపేర్ బాధ్యతను తాము తీసుకోలేరని, వాహనాన్ని మరో సర్వీసింగ్ కేంద్రానికి పంపాలని సూచించారు.
షోరూమ్ ముందే ఓలా వాహనానికి నిప్పంటించిన కస్టమర్
స్టీరింగ్ రాడ్ విరిగిపోయిందని చెప్పినా కంపెనీ సిబ్బంది పట్టించుకోలేదని ఆగ్రహం
గుజరాత్–పాలన్‌పూర్ ప్రాంతంలో తన భార్య, కుమారుడితో కలిసి బయటికి వెళ్లి ఇంటికి తిరిగి వెళ్తుండగా తన ఓలా వాహనం స్టీరింగ్ రాడ్ విరిగిపోయిందని షోరూముకు… pic.twitter.com/JFyax4IzWd
— Telugu Scribe (@TeluguScribe) October 9, 2025
దాదాపు లక్ష రూపాయల విలువైన తన వాహనానికి, తన కుటుంబానికి ఎదురైన ప్రమాదానికి సిబ్బంది పట్టించుకోకపోవడం సాహిల్‌ను తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. సాహిల్ స్కూటర్‌పై పెట్రోల్ పోసి షోరూమ్ ముందు నిప్పంటించాడు. మంటల్లో ఆ వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన తర్వాత, ఓలా వాహనదారులలో సర్వీస్ నాణ్యత, సాంకేతిక లోపాలపై పెరుగుతున్న ఆందోళనలు మరల వెలుగులోకి వచ్చాయి. నిపుణులు, కస్టమర్ల ఆగ్రహం కంపెనీకి మెరుగైన సర్వీస్ ప్రమాణాలను పెంపొందించేందుకు సంకేతమని చెప్పుతున్నారు.


