- షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారికి తల్లిదండ్రుల వినతి
కాకతీయ, హుజురాబాద్ : జమ్మికుంట మండలంలో పలు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులు, పెండింగ్‌లో ఉన్న ఫీజుల బిల్లులను తక్షణమే విడుదల చేయాలంటూ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారికి సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లడుతూ తమ పిల్లలు వివిధ బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో చదువుతుండగా ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు వాయిదా పడటంతో పాఠశాల యాజమాన్యాలు తమ పిల్లలను తరగతులకు అనుమతించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు తరగతులకు హాజరు కాలేకపోవడం వల్ల వారి విద్యార్హతకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు తెలిపారు. ఇది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నట్లే అని ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తమ పిల్లల చదువులపై మచ్చ పడుతోందని వెంటనే బకాయిలు విడుదల చేసి, విద్యార్ధులకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని అధికారిని కోరారు.


