కాకతీయ, కెరీర్: భారత సైన్యంలో ఉద్యోగం చేయాలనుకునే అభ్యర్థులకు శుభవార్త. ఇండియన్ ఆర్మీ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ (DG EME) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా నవంబర్ 14, 2025 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 69
పోస్టుల వివరాలు:
జూనియర్ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్ (JTTI) – 02
స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II – 02
లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) – 25
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) – 14
వాషర్‌మ్యాన్/ధోభి – 03
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (అదనపు విభాగాలు) – 23
అర్హతలు:
జూనియర్ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్ (JTTI): ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌లో B.Sc డిగ్రీతో పాటు డిగ్రీలో కనీసం ఒక సంవత్సరం ఇంగ్లీష్ చదివి ఉండాలి.
స్టెనోగ్రాఫర్, MTS, LDC: గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుండి 12వ తరగతి ఉత్తీర్ణత అవసరం.
వాషర్‌మ్యాన్/ధోభి: గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యులేషన్ లేదా సమాన అర్హత తప్పనిసరి.
వయోపరిమితి:
JTTI పోస్టులకు: 21 నుంచి 30 సంవత్సరాల మధ్య.
ఇతర పోస్టులకు: 18 నుంచి 25 సంవత్సరాల మధ్య.
సర్కార్ నిబంధనల ప్రకారం రిజర్వ్ వర్గాలకు వయో పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: అక్టోబర్ 11, 2025
చివరి తేదీ: నవంబర్ 14, 2025
ఎంపిక విధానం:
అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష ఆధారంగా జరుగుతుంది. ఈ పరీక్ష OMR ఆధారిత ఆబ్జెక్టివ్ ప్రశ్నల రూపంలో ఉంటుంది.
పరీక్షా వివరాలు:
మొత్తం ప్రశ్నలు: 150
మొత్తం మార్కులు: 150
ప్రతీ తప్పు సమాధానానికి 0.25 మార్కులు నెగటివ్ మార్కింగ్.
ప్రశ్నల విభాగాలు:
జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్
జనరల్ అవేర్‌నెస్
జనరల్ ఇంగ్లీష్
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ indianarmy.nic.in ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఈ నోటిఫికేషన్ ద్వారా భారత సైన్యంలో సివిలియన్ ఉద్యోగాల కోసం మరో అద్భుతమైన అవకాశం లభించింది. అర్హులైన అభ్యర్థులు చివరి తేదీకి ముందే దరఖాస్తు చేయడం మంచిది.


