ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులదే కీలకపాత్ర
మండల స్పెషల్ ఆఫీసర్, ఎన్నికల నోడల్ అధికారి శ్రీనివాసరావు, ఎంపీడీఓ అరుంధతి
కాకతీయ, దుగ్గొండి: ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమైనదని, అధికారులు సమన్వయoగా పని చేయాలని మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసరావు అన్నారు. తెలిపారు. బుధవారం మండల పరిషత్ సమావేశ మందిరంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు సంబందించి, రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులఎన్నికల విధులు, బాధ్యతలు,నియమ నిబంధనల పైన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసరావు, ఎంపీడీఓ అరుంధతి లు మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించిన నియమ నిబంధనలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని, ఎన్నికల విధులను అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. అధికారులు తమకు ఇచ్చిన హ్యాండ్‌బుక్‌ను క్షుణ్ణంగా చదివి ప్రతీ అంశంపై అవగాహన కలిగి ఉండాలని, ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా విధులు నిర్వహించాలన్నారు.
ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రతి బాధ్యత,రిటర్నింగ్ అధికారిదేనని పోలింగ్ సిబ్బంది నియామకం, పోలింగ్ కు సంబంధించిన సామాగ్రి సమకూర్చుకోవం మొదలగు ప్రతి అంశాలను క్షుణ్ణంగా పర్యవేక్షించాల్సి ఉంటుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో నామినేషన్ల ప్రక్రియ కీలకమైనదని అన్నారు. అదనపు కలెక్టర్ నామినేషన్లపై రిటర్నింగ్ అధికారులకు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు సూచనలు చేశారు. నిర్వహణ ప్రక్రియలో ఏమైనా సందేహాలు, అపోహలు ఉంటే నివృత్తి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల పంచాయితీ అధికారి మోడెం శ్రీధర్ గౌడ్, మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, సబ్ ఇన్స్పెక్టర్ రావుల రణధీర్, ఇరిగేషన్ ఏఈ సతీష్, రిటర్నింగ్ అధికారులు, పంచాయితీ కార్యదర్శులు పాల్గొన్నారు.


