న్యూ డెమోక్రసీ పార్టీని వీడిన అవిరె నారాయణ
కాకతీయ, బయ్యారం: మండలంలోని అల్లిగూడెం గ్రామపంచాయతీ చెందిన అవిరె నారాయణ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీని వీడుతున్నట్లు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా తన 14 సంవత్సరాల నుండి న్యూ డెమోక్రసీ పార్టీలో నాలుగు దశాబ్దాల కాలం అనేక విభాగాలలో పనిచేసినట్లు తెలిపారు.న్యూడెమోక్రసీ పార్టీ చండ్ర పుల్లారెడ్డి, గడ్డం వెంకటరామయ్య, అశోక్ అజ్ఞాత దళం సమయంలో కొరియర్ పని చేసి అనేక కేసులపాలయ్యామని గుర్తు చేశారు. న్యూ డెమోక్రసీ పార్టీ సిద్ధాంతాలను గాలికి వదిలి , పార్టీ ముక్క చెక్కలై ప్రజాఆధరణ కోల్పోయిందని, ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పార్టీలో చేరకుండా, స్వచ్ఛందంగా జీవితం గడపాలని అనుకుంటున్నాట్టు తెలిపారు.


