కాకతీయ, ములుగు ప్రతినిధి: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేతుల మీదుగా సమ్మక్క–సారక్క కేంద్ర విశ్వవిద్యాలయం అధికారిక లోగో ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆదివాసుల ఆరాధ్య దేవతలైన సమ్మక్క, సారక్క పేరును యూనివర్సిటీకి ఇవ్వడం గిరిజన గౌరవానికి ప్రతీక అని, వారి ఆశయాలకు అనుగుణంగా ఈ విశ్వవిద్యాలయం జ్ఞానం, సంస్కృతి, సమానత్వం వైపు దారితీస్తుంది అని తెలిపారు. ఈ సందర్భంగా రూపొందించిన లోగోలో గిరిజన సంస్కృతి, స్త్రీ శక్తి, విద్యా విలువలను ప్రతిబింబించే అంశాలను చక్కగా సమన్వయం చేశారు అని, లోగో బ్యాక్‌గ్రౌండ్‌గా స్త్రీలకు పవిత్రమైన పసుపు రంగును ఎంచుకోవడం విశేషం అని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ వై.ఎల్. శ్రీనివాస్, ఓఎస్‌డీ వంశీ, ఇతర విశ్వవిద్యాలయ ప్రతినిధులు పాల్గొన్నారు.


