- ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌ను తుంగలో తొక్కిన ప్రభుత్వం
- అభ్యర్థుల ఆన్సర్ షీట్లను డిస్పోజ్ చేస్తే ఊరుకోం..
- నిరుద్యోగులతో కలిసి కమిషన్‌ను స్తంభింప చేస్తాం..
- రేవంత్ సర్కార్‌కు కవిత హెచ్చరిక
కాకతీయ, తెలంగాణ బ్యూరో : గ్రూప్ – 1 నియామకాల్లో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలు తప్పనిసరిగా అమలు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం ఓ వీడియోను విడుదల చేశారు. ఫలితాలు ప్రకటించి నియామక పత్రాలు అందజేసినా… వారికి ఆ ఉద్యోగాలపై ఎలాంటి హక్కులేదని సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించింది అంటే ఈ మొత్తం ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని తప్పులను చేసిందో సుప్రీం కోర్టు ఎత్తిచూపినట్టే అన్నారు.
అడ్డుకుంటాం..
గ్రూప్ -1 ఉద్యోగ నియామకాల వివాదం న్యాయ స్థానాల్లో తేలేవరకు అభ్యర్థుల మెయిన్స్ ఆన్సర్ షీట్లను తొందరపడి డిస్పోజ్ చేయొద్దన్నారు. తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ -1 నోటిఫికేషన్ నుంచి ఫలితాల ప్రకటన వరకు అనేక తప్పులు చేసింది.. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తుంగలో తొక్కిందని ధ్వజమెత్తారు. న్యాయస్థానాలు తుది తీర్పు ఇచ్చేలోపు ప్రభుత్వం అభ్యర్థుల మెయిన్స్ ఆన్సర్ షీట్లను డిస్పోజ్ చేస్తే నిరుద్యోగులతో కలిసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను స్తంభింప చేస్తామని కవిత హెచ్చరించారు.


