స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకం.
మన లక్ష్యం కేవలం విజయమే కాదు ప్రజల్లో పార్టీకి మరింత బలం చేకూర్చడం కూడా.
పాలకుర్తి నియోజకవర్గ శాసన సభ్యురాలు యశస్విని రెడ్డి
కాకతీయ, పెద్దవంగర : స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకమని పాలకుర్తి నియోజకవర్గ శాసన సభ్యురాలు యశస్విని రెడ్డి అన్నారు. మంగళవారం పాలకుర్తి మండల కేంద్రంలో ఆమె అధ్యక్షతన పెద్దవంగర మండల ముఖ్య నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని,ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకమని పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు సమన్వయంతో పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను వివరించాలన్నారు.ప్రజల నమ్మకం గెలుచుకోవడం ద్వారా అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించాలని, మన లక్ష్యం కేవలం విజయమే కాదు, ప్రజల్లో పార్టీకి మరింత బలం చేకూర్చడం కూడా అని అన్నారు.ఈ సందర్భంగా నాయకులకు దిశా నిర్దేశం చేస్తూ, ప్రతి గ్రామంలో పార్టీ బూత్ కమిటీలను బలోపేతం చేయాలని సూచించారు. పార్టీ తీరుపై, స్థానిక అభివృద్ధి అంశాలపై నాయకులతో చర్చించారు. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు ముద్దసాని సురేష్,ఉపాధ్యక్షులు రంగు మురళి గౌడ్ సీనియర్ నాయకులు ప్రవీణ్ రావు, నెహ్రూ నాయక్, హుమ్య నాయక్, వెంకన్న నాయక్,చిలుక దేవేంద్ర సంజీవ రావు, తోటకూరి శ్రీనివాస్, బండారి వెంకన్న,రవీందర్ రెడ్డి, సైదులు, సతీష్, వేణు,పూర్ణ చందర్,జగ్గా నాయక్, సితారం నాయక్ శ్రీను ముదిరాజ్,సోమన్న,
హరికృష్ణ,రాజు యాదవ్, సోమన్న నాయక్ తదితరులు ఉన్నారు.


