కాకతీయ, నడికూడ : హన్మకొండ జిల్లా నడికూడ మండలానికి చెందిన స్కై, ఐపీఎస్ విద్యా సంస్థల చైర్మన్ మొర్రి ( ఐపీఎస్ ) కుమార్ యాదవ్ సోమవారం బీజేపీలో చేరారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా వారికి జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ రెడ్డి, సిరంగి సంతోష్ కుమార్, దేవనూరి మేఘనాథ్, పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నడికూడ మండల అధ్యక్షుడు ఎరుకల దివాకర్, మండల ప్రధాన కార్యదర్శులు తిప్పారపు సుధీర్, దండు సురేష్, గోనెలా కోటేశ్వర్ గురుమూర్తి, శివకుమార్,నర్మెట్ట శ్రీనివాస్ గౌడ్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు మహేష్ గౌడ్, ఆకుల శ్రీకాంత్, సండ్ర మధు, స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
బీజేపీలో చేరిన ఐపీఎస్ విద్యా సంస్థల చైర్మన్
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


