- మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమాన్ సింగ్
కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, ఇతర అంశాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సోమవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న ఖరీఫ్ సీజన్లో ముందస్తు ప్రణాళిక ప్రకారం జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేయాలన్నారు. సంబంధిత విభాగాల అధికారులు సమన్వయంతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఐకెపి, గిరిజన కార్పొరేషన్, ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలు, తదితర సంస్థల ద్వారా సుమారు (237) కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
కేంద్రాలలో గన్ని సంచులు, అవసరానికి అనుగుణంగా ముందస్తుగా సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు,
కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంట వెంటనే రైస్ మిల్లులకు పంపే విధంగా ప్రణాళిక ప్రకారం లారీలను, హమాలీలను సిద్ధంగా ఉంచుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె.అనిల్ కుమార్, డీఆర్ డీవో ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, డీసీవో వెంకటేశ్వర్లు, డీఎస్వొ ప్రేమ్ కుమార్, డీఏవో విజయనిర్మల, డిఎం సివిల్ సప్లై క్రిష్ణవేణి, మార్కెటింగ్ అధికారి వెంకటేశ్వర్లు, ఎల్డిఎం, ఆర్టీవో సాయిచరణ్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.


