- బాకీ కార్డు ఉద్యమం
కాకతీయ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు “బాకీ కార్డు ఉద్యమం”ను మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా చేపట్టాలని నిర్ణయించారు. మేడ్చల్ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు ఆధ్వర్యంలో పార్టీ ప్రజా ప్రతినిధులు, ముఖ్యనాయకులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణరావు. వివేకానంద గౌడ్, బండారి లక్ష్మా రెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, మాల్కాజ్‌గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డితో పాటు జిల్లా ముఖ్యనాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన 420 హామీలు ఇచ్చి ప్రజలను పూర్తిగా మోసం చేసిందని, విమర్శించారు. కాంగ్రెస్ మోసపూరిత వైఖరిని, వంచనను బయటపెట్టడానికి బీఆర్ఎస్ పార్టీ “బాకీ కార్డు” రూపంలో ప్రజల్లోకి వస్తోందని పేర్కొన్నారు.


