కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. నవంబర్ 11వ తేదీన ఉపఎన్నిక నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. జూబ్లీహిల్స్ పరిధిలో మొత్తం 3,92,669 మంది ఓటర్లు ఉన్నారు. కాగా మాగంటి గోపినాథ్ అకాల మరణంలో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.
ఉప ఎన్నిక నోటిఫికేషన్ అక్టోబర్ 13
నామినేషన్లకు తుది గడువు అక్టోబర్ 21
నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు అక్టోబర్ 24
పోలింగ్ తేదీ నవంబర్ 11
ఓట్ల లెక్కింపు నవంబర్ 14


