కాకతీయ, నేషనల్ డెస్క్: బంగారం ధర భారీగా పెరుగుతోంది. రోజుకో కొత్త రికార్డ్ క్రియేట్ చేస్తూ అందనంత ఎత్తుకు చేరుకుంటోంది. ట్రంప్, టారిఫ్ లు, అంతర్జాతీయ భౌగోళిక పరిస్థితులు, కేంద్రీయ బ్యాంకులు కొనుగోళ్లు కలిపి బంగారానికి ఇన్నాళ్లు డిమాండ్ పెరిగింది. తాజాగా అమెరికా ఫెడరల్ గవర్నమెంట్ షట్ డౌన్ ఇంకా కొనసాగుతుండటంతో బంగారం ధరలు అడ్డూ అదుపులేకుండా పెరుగుతున్నాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ ధర 4వేల డాలర్ల దిశగా దూసుకెళ్తోంది. అంతర్జాతీయ ధరలను అనుసరించి దేశీయంగా బంగారం ధర సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది.
హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,13,420కి చేరింది. 22క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,10, 7పలుకుతోంది. అటు కిలో వెండి ధర లక్షన్నర దాటింది. హైదరాబాద్ లో ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 1.54లక్షలు గా ఉంది. బంగారం ధర భారీగా పెరుగుతుండటంతో విక్రయాలు తగ్గాయని వ్యాపారులు అంటున్నారు. ప్రత్యామ్నాయంగా ఇతర ఆభరణాల వైపు మగువలు మొగ్గుచూపిస్తున్నారని చెబుతున్నారు. దీపావళి నాటికి తులం బంగారం ధర లక్షా 50వేలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.


