కాకతీయ, తెలంగాణ బ్యూరో: సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ పై దాడికి యత్నించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. కేసు విచారణ సమయంలో లాయర్ దుస్తువుల్లో వచ్చిన ఓ వ్యక్తి డయాస్ దగ్గరకు దూసుకెళ్లి ఆయనపై ఓ వస్తువును విసిరివేసిందుకు యత్నించాడు. సిబ్బంది వెంటనే ఆ వ్యక్తిని అడ్డుకుని బయటకు లాక్కెళ్లారు. ఈ క్రమంలో అతను సనాతన ధర్మాన్ని కించపరిచేవారిని వదిలిపెట్టం అంటూ గట్టిగా అరిచాడు. దీంతో మీ వాదనలు వినిపించండి.. ఇలాంటివి నాపై ఎలాంటి ప్రభావం చూపవని న్యాయవాదులకు సీజేఐ సూచించారు.
సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ గవాయ్ పై దాడికి యత్నం..!!
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


