కాకతీయ, గీసుగొండ: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గీసుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లందరికీ ఇన్‌స్పెక్టర్ విశ్వేశ్వర్ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఎన్నికల సమయంలో కానీ, శాంతిభద్రతలకు ఎటువంటి ఇబ్బందులు సృష్టించే విధంగా ప్రవర్తిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని గట్టి హెచ్చరిక జారీ చేశారు.ఈ సందర్భంగా తహసిల్దార్ ఎండి రియాజుద్దీన్ సమక్షంలో రౌడీషీటర్లందరినీ భవిష్యత్తులో మంచి ప్రవర్తనకు కట్టుబడి ఉండేలా బైండ్‌ఓవర్ చేశారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అందరూ సహకరించాలని ఆయన కోరారు.


