కాకతీయ, ఆత్మకూర్ : హనుమకొండ జిల్లా ఆత్మకూర్ పోలీసు అధికారులు అక్రమంగా నడుస్తున్న బెల్ట్‌షాప్‌పై దాడి నిర్వహించి, ఒకరిని అరెస్ట్ చేశారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూర్ గ్రామానికి చెందిన పాండవుల రఘు అనే వ్యక్తి సుమిత కిరాణా షాప్ లో ఎటువంటి లైసెన్స్ లేకుండా అక్రమంగా మద్యం విక్రయిస్తుండగా పట్టుబడ్డాడు. దాడిలో 10 మద్యం బాటిళ్లు, ఎంసీ డౌల్స్, ఇంపీరియల్ బ్లూ, ఆఫీసర్ చాయిస్, రాయల్ స్టాగ్, రాయల్ గ్రీన్ వంటి ఫుల్ బాటిళ్లు సుమారు రూ.9,400 విలువైనవి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఆత్మకూర్ పోలీస్ స్టేషన్‌లో తెలంగాణ ఎక్సైజ్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి, నిందితుడిని కస్టడీలోకి తీసుకున్నారు. ఆత్మకూర్ పోలీస్ అధికారులు మాట్లాడుతూ.. ప్రాంతంలో అక్రమ మద్యం విక్రయాలపై కఠిన చర్యలు కొనసాగిస్తామని, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై ఎటువంటి రాయితీ ఉండదని స్పష్టం చేశారు.


