కాకతీయ, నెల్లికుదురు : కొడుకుకు అడ్డు వస్తోందని భార్యను హత్య చేసిన కేసులో భర్తను అరెస్టు చేసినట్లు కేసముద్రం సీఐ సత్యనారాయణ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై రమేష్ బాబుతో కలిసి శనివారం ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ..చీకటి నరేష్ తన కొడుకు విక్రమ్ చెడు తిరిగుళ్లు తిరుగుతున్నాడని మందలిస్తున్న ప్రతి సారి తన భార్య చీకటి స్వప్న అడ్డువస్తోందని, శుక్రవారం గొడ్డలితో భార్య పై దాడి చేయడంతో తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే మృతి చెందిందన్నారు. మృతురాలి సోదరి మాచర్ల ఉమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. శనివారం నెల్లికుదురు ఎం మార్ట్ వద్ద నిందితుడు నరేష్ ను అరెస్టు చేసి రిమాండ్ కోసం కోర్టుకు తరలించినట్లు సీఐ తెలిపారు.


