- రైతులు దళారుల చేతిలో మోసపోకుండా చూడాలి
- రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి
- సీసీఐ ఉన్నతాధికారులతో చర్చలు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : దళారుల చేతుల్లో పత్తి రైతులు మోసపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి కోరారు. ఈమేరకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులతో పత్తి పంట కొనుగోళ్లపై ఫోన్‌లో మాట్లాడారు. రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. పత్తి సాగుచేసే రైతులు పంట అమ్మకాల సమయంలో దళారుల చేతుల్లో మోసపోతున్నారని వివరించారు. తొందరపడి ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకోవడం వల్ల నష్టపోతున్న విషయాలను సీసీఐ దృష్టికి తీసుకెళ్లారు.
సీసీఐ కొనుగోళ్లలో కూడా కొందరు దళారులు ఇన్వాల్ అవుతున్న విషయాలను సైతం సీసీఐ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గతేడాది తెలంగాణలో పత్తి కొనుగోళ్లలో జరిగిన లోపాలను కూడా వివరించారు. పత్తి రైతులకు నష్టం జరగకుండా కొనుగోళ్లు జరిగేలా చూడాలని సీసీఐకి సూచించారు. ఈనెల 6వ తేదీన పత్తి కొనుగోలు ప్రతిష్టంభన విషయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సంబంధిత అధికారులతో కేంద్ర కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సమావేశం ఉంటుందని, అప్పుడు ఇంకా వివరంగా పత్తి కొనుగోళ్ల అంశంపై నిర్ణయం జరుగుతుందని కోదండరెడ్డి పేర్కొన్నారు.


