కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు మండలం దేవగిరిపట్నం గ్రామంలో ప్రమాదవశాత్తు చెట్టుపై నుండి పడి ఒక వ్యక్తి మృతి చెందిన విషాద సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అదే గ్రామానికి చెందిన భూక్య శ్రీను (40) కూలి పని నిమిత్తం శనివారం ఉదయం కొబ్బరి చెట్టుపైకి ఎక్కి కొమ్మలు కట్ చేస్తుండగా జారిపడి కిందపడ్డాడు. తీవ్ర గాయాలపాలైన శ్రీనును స్థానికులు వెంటనే ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించగా, అక్కడి వైద్యులు పరిశీలించి అతడు అప్పటికే మృతిచెందినట్లు ప్రకటించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు గ్రామస్థులు తెలిపారు. ములుగు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


