- బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్
- ఘనంగా ‘అలయ్ బలయ్’
కాకతీయ, వరంగల్ : మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ దత్తాత్రేయ అనగానే హోలీ, అలయ్ బలయ్ రెండు పండుగలు గుర్తొస్తాయని అన్నారు. హోలీ పండుగను దత్తాత్రేయ చాలా గొప్పగా నిర్వహిస్తారన్నారు. ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డే అన్నట్లు కేంద్రమంత్రి అయినా, గవర్నర్ అయినా, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను రాబోయే తరాలకు అందించాలనే ఉద్దేశంతో 20 సంవత్సరాలుగా అలయ్ బలయ్ నిర్వహిస్తున్నారని, దత్తాత్రేయ మనుషుల మధ్య స్నేహం పెరగడానికి ఈ కార్యక్రమం చేస్తున్నారని తెలిపారు. ప్రజల మధ్య అంతరాలు తగ్గించి సమాజాన్ని సంఘటితం చేయడం కోసం ఆయన కృషి చేస్తున్నారనీ, ఈ సంస్కృతి రాబోయే తరాలకు స్ఫూర్తి అని దత్తాత్రేయ చూపిన బాటలో అందరూ నడవాలని, తమలాంటి అనేక మంది కార్యకర్తలకు స్ఫూర్తి ప్రదాత బండారి దత్తాత్రేయ అని రవికుమార్ అన్నారు.


