epaper
Monday, March 2, 2026
epaper

బీజాపూర్​ లో 103 మంది మావోయిస్టుల లొంగుబాటు..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో ప్రభుత్వం ఎదుట లొంగిపోతున్నారు. తాజాగా బీజాపూర్ జిల్లాలో 103 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వారిలో 49 మందిపై కోటి ఆరు లక్షల రూపాయల రివార్డు ఉండడం గమనార్హం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే 2026 మార్చి 31 నాటికి దేశాన్ని మావోయిస్టు రహితంగా తీర్చిదిద్దే లక్ష్యం ఉన్నదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో, భీకరమైన ఎన్‌కౌంటర్లు, ఆపరేషన్ కగార్ వంటి ప్రభుత్వ చర్యల కారణంగా పెద్దసంఖ్యలో మావోయిస్టులు హతమవుతున్నారు. ఫలితంగా కొందరు లొంగిపోతున్నారు.

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ వల్ల మావోయిస్టుల పక్కా నష్టం తగిలింది. దంతేవాడ జిల్లాలో గత 19 నెలల్లో 461 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో 129 మందిపై రివార్డు కూడా ఉంది. లొంగిపోయిన వారికి ప్రభుత్వం పునరావాసం కోసం రూ.50,000 చొప్పున ఆర్థిక సాయం, నైపుణ్యాభివృద్ధి శిక్షణ, వ్యవసాయ భూములు కేటాయిస్తుంది.

హయ్యెస్ట్ రివార్డు ఉన్న 9 మంది నక్సల్స్‌ను ఇప్పటికే హతమార్చారు. తాజాగా (సెప్టెంబర్) బస్తర్‌లో అత్యధిక లొంగుబాటు జరిగింది. దంతేవాడలో 71 మంది నక్సలైట్లు ఒకేసారి ప్రభుత్వ ఎదుట వచ్చారు. వారు లోన్ వరెంట్ (ఇంటికి తిరిగి రండి) ప్రచారం ప్రభావంతో లొంగిపోయారని తెలిపారు. అయితే, బస్తర్‌లో ఇంకా చాలా మంది నక్సలైట్లు చురుకుగా ఉన్నారు. గతంలో వారు రోడ్లు తవ్వడం, చెట్లు నరికివేయడం, మావోయిస్టు బ్యానర్లు, పోస్టర్లు, కరపత్రాలు పంచడం, పోలీసులు మరియు పోలీస్ స్టేషన్లపై దాడులు చేయడం వంటి అనేక హింసాత్మక చర్యల్లో పాల్గొన్నారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం, లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పించడం, ఉపాధి అవకాశాలు, వనరులు, సౌకర్యాలు అందించడం జరుగుతోంది. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో రోడ్డు, రవాణా, విద్యుత్, నీటి సౌకర్యాలు, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు గ్రామీణ ప్రజలకు చేరడం కొనసాగుతున్నాయి. ఈ చర్యల వల్ల మావోయిస్టుల వ్యాప్తి తగ్గి, చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు రహిత భారత్‌ లక్ష్యానికి దిశగా కేంద్రం ముందుకెళ్తోంది.

 

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం యువకుడిపై కత్తులు, రాళ్లతో దాడి సఖి సెంటర్ వద్ద...

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు కాకతీయ, ఖమ్మం: నగరంలోని కృష్ణవేణి కోపరేటివ్...

ఇంటర్ పరీక్ష కేంద్రాల తనిఖీ.. సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు

ఇంటర్ పరీక్ష కేంద్రాల తనిఖీసెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలుడీఎస్పీ రవీందర్...

పూర్తిస్థాయి కలెక్టర్‌గా గరిమ అగర్వాల్ నియామకం

పూర్తిస్థాయి కలెక్టర్‌గా గరిమ అగర్వాల్ నియామకం కాకతీయ, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల...

రాష్ట్రంలో 45 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు – కీలక శాఖలు, జిల్లాల్లో మార్పులు

45 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు… కీలక శాఖలు, జిల్లాల్లో మార్పులు కాక‌తీయ‌, తెలంగాణ...

జీవన్ రెడ్డి ఆరోగ్యంపై కీల‌క ప్ర‌క‌ట‌న‌

జీవన్ రెడ్డి ఆరోగ్యంపై కీల‌క ప్ర‌క‌ట‌న‌ కాకతీయ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్...

మాజీ మంత్రి జీవన్ రెడ్డికి అస్వస్థత – నిమ్స్‌లో చికిత్స

బిగ్ బ్రేకింగ్‌..! మాజీ మంత్రి జీవన్ రెడ్డికి తీవ్ర అస్వస్థత ఇటీవల రాజకీయ పరిణామాలతో...

ఖమ్మం నారాయణ హాస్టల్‌లో డ్రగ్స్ కలకలం – విద్యార్థిపై దాడి

నారాయణ హాస్టల్‌లో డ్రగ్స్ కలకలం మత్తులో ఇద్దరు విద్యార్థుల దాడి… ఇంటర్ విద్యార్థి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img