కాకతీయ, నేషనల్ డెస్క్: కర్ణాటకలో ఒక దారుణమైన కుటుంబ ఘటన చోటుచేసుకుంది. శివమొగ్గలో 38 ఏళ్ల శృతి తన 12 ఏళ్ల కుమార్తె పూర్విక ను చంపి, తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. భర్త, ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. షిఫ్ట్ ముగించుకుని రాత్రి ఇంటికి వచ్చిన ఆయన భార్య, కూతురి మృతదేహాలను చూసి షాక్ అయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. శృతి మానసిక పరిస్థితి సరిగ్గా లేకనే తన కూతురిని హత్య చేసి తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పూర్తి విచారణ జరుపుతున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు.


