కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో తాజాగా ఎన్నికల హవా మొదలైన వేళ, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలను కుదిపేస్తున్నాయి.
గతంలో బీహార్ ప్రజలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జన సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ ఇంకా మండిపడుతూనే ఉన్నారు. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతుండటంతో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీహార్ ప్రచారంలో ఉపయోగించుకోవలని సూచిస్తుంది. ఈ విషయాన్ని తెలుకున్న ప్రశాంత్ కిషోర్ బీహార్ ప్రజలను తక్కువ చేసి హేళనగా మాట్లాడిన రేవంత్ రెడ్డి తమ గడ్డనపై అడుగుపెడితే తరిమికొడతామంటూ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా ఓ జాతీయ మీడియాతో జరిగిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణకు వెళ్లి మరీ రేవంత్ రెడ్డి ఓడించి తీరుతానంటూ సంచలన కామెంట్స్ చేశారు.
అలాగే తన నుంచి రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ కానీ, మోదీ కానీ కాపాడలేరంటూ బీజేపీ, టీడీపీ ఇలా అన్ని పార్టీలు తిరిగి అతి కష్టం మీద ఒకసారి సీఎం అయ్యాడని..మళ్లీ తిరిగి ఇంకోసారి గెలిచే సత్తా రేవంత్ కు లేదన్నారు. బీహార్ ప్రజల డీఎన్ఏ తెలంగాణ ప్రజల డీఎన్ఏ కంటే తక్కువ అయినప్పుడు ఢిల్లీకి వచ్చి సహాయం చేయమని నన్ను మూడు సార్లు ఎందుకు అడిగావ్ అంటూ ప్రశాంత్ కిషోర్ ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ, మోదీ ఎవరు కూడా రేవంత్ రెడ్డిని కాపాడలేని..అతన్ని కచ్చితంగా ఓడించి తీరుతానని ఈ సందర్భంగా పీకే సవాల్ విసిరారు.
వచ్చే ఎన్నికల్లో తెలంగాణకి వెళ్లి మరీ రేవంత్ రెడ్డిని ఓడించి తీరుతాను
రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ, మోడీ కాదు కదా ఎవరూ కాపడలేరు
బీజేపీ, టీడీపీ ఇలా అన్ని పార్టీలు తిరిగి అతి కష్టం మీద ఒకసారి ముఖ్యమంత్రి అయ్యాడు, మళ్లీ ఇంకోసారి గెలవడు
బీహార్ ప్రజల DNA తెలంగాణ ప్రజల DNA కంటే… pic.twitter.com/nXN45N5quY
— Telugu Scribe (@TeluguScribe) October 3, 2025
ఈ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెరిగింది. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇక బీజేపీ, బీఆర్‌ఎస్ వర్గాల్లో మాత్రం ప్రశాంత్ కిషోర్ మాటలు చర్చనీయాంశంగా మారాయి.


