epaper
Sunday, March 1, 2026
epaper

అంగరంగ వైభవంగా విజయదశమి వేడుకలు

రంగలీల మైదానంలో 70 అడుగుల రావణ ప్రతిమ దహనం

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

కాకతీయ, వరంగల్ ప్రతినిధి: వరంగల్ నగరంలోని  ఉర్సు రంగాలీలా మైదానంలో గురువారం సాయంత్రం నిర్వహించిన దసరా సంబరాలు అంబరాన్నంటాయి.   వేడుకల్లో  మంత్రి  కొండ సురేఖ, శాసనమండలి ఉపసభాపతి బండ ప్రకాష్, నగర  మేయర్  గుండు సుధారాణి,  ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య,    కమిషనర్ చాహాత్ బాజ్ పాయి పాల్గొన్నారు. రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మాత్యులు  కొండ సురేఖ ఆటోమెటిక్ స్విచ్ ఆన్ చేసి  రావణ వధ, దసరా వేడుకలను ప్రారంభించారు.

దసరా ఉత్సవ కమిటీ అధ్యక్షులు నాగపురి సంజయ్ బాబు, జనరల్ సెక్రెటరీ మేడిది మధుసూదన్, ట్రస్ట్ చైర్మన్ కోటేశ్వర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పది తలలతో కూడిన 70 అడుగుల రావణ ప్రతిమ దహన ఘట్టం నేత్రపర్వంగా జరిగింది. మిరుమిట్ల గొలుపే వెలుగుల్లో బాణసంచా పేలుళ్లతో ప్రాంగణమంతా మార్మోగింది.  రావణ కార్యక్రమానికి ప్రారంభించే ముందు కరీంబాద్ రామస్వామి గుడి నుండి సీతారామాంజనేయ, లక్ష్మణుడి విగ్రహాలను రథంపై ప్రతిష్టించి వేలాది మంది వెంటరాగా,  కోలాటం   డప్పు చప్పుళ్ళు,  వాయిద్యాలు భజనలు నృత్యాల నడుమ రంగలీల మైదానికి   చేరుకున్నారు.  అనంతరం షమీ పూజ, పాలపిట్ట దర్శనం నిర్వహించారు.

వేడుకల్లో పేరిణి శివతాండవం, కూచిపూడి నృత్యాలు విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, రాణి రుద్రమ్మ, జానపద గేయాలు తెలంగాణ ఆటపాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. యువతి యువకులు కేరింతలు కొడుతూ సంబరాల్లో మునిగితేలారు. చెడుపై విజయం సాధించిన రోజునే ప్రజలు విజయదశమిగా జరుపుకోవాలని ఆనవాయితీగా వస్తోందని మంత్రి కొండ సురేఖ అన్నారు.  వేడుకలకు ప్రారంభించిన మంత్రి  దసరా విశిష్టతను గురించి కులంకశంగా వివరించారు.

రంగలీలా మైదానంలో భక్తుల సౌకర్యార్థం జిల్లా యంత్రాంగం, గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో  ఏర్పాట్లు చేయడంపై మంత్రి ధన్యవాదాలు తెలిపారు. నగర నలుమూలల నుండి వచ్చిన ప్రజలకు ఈ సందర్భంగా దసరా శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం మంత్రి, నగర మేయర్ తో కలసి  రంగశాయిపేట, కొత్తవాడ, తోట మైదానం ఆప్రాంతాలలో జరిగిన సంబరాల్లో  పాల్గొన్నారు.ఈ కార్యక్రమాల్లో కార్పొరేటర్లు మరుపల్ల రవి, పోశాల పద్మ, ముష్కమల్ల అరుణ, జలగం అనిత, స్థానిక ప్రజాప్రతినిధులు, జిడబ్ల్యూఎంసీ, సంబంధిత శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img