మాజీమంత్రి దామోదర్‌రెడ్డి కన్నుమూత
కాకతీయ, తెలంగాణ బ్యూరో : మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి (73) బుధవారం రాత్రి కన్నుమూశారు.కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దామోదర్ రెడ్డి.. కొద్దిసేపటి క్రితం ఏఐజీ హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు. దామోదర్‌రెడ్డి ఐదు సార్లు ఎమ్మెల్యేగా, ఓసారి మంత్రిగా పనిచేశారు. తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించారు వైయస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో ఐటీ శాఖ మంత్రిగా దామోదర్‌రెడ్డి పనిచేశారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి లో దామోదర్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లుగా కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి మృతిపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంతాపం తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాలలో రాంరెడ్డి దామోదర్ రెడ్డి తనదైన ముద్ర వేశారని గుర్తు చేశారు. దామోదర్ రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ, వారి కుటుంబ సభ్యులకు స్పీకర్ ప్రసాద్ కుమార్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.


