epaper
Monday, March 2, 2026
epaper

దేశాన్ని రక్షించేందుకు ప్ర‌తీ పౌరుడు సిద్ధంగా ఉండాలి

దేశాన్ని రక్షించేందుకు ప్ర‌తీ పౌరుడు సిద్ధంగా ఉండాలి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు పిలుపు
కార్గిల్ విజయ్ దివస్‌ను పురస్కరించుకుని బీజేపీ ఆధ్వ‌ర్యంలో భారీ ర్యాలీ
భారత మాజీ ఆర్మీ జవాన్లకు ఘన సన్మానం

కాక‌తీయ‌, రాజాపూర్‌(జూలై 26) : కార్గిల్ విజయ్ దివస్‌ను పురస్కరించుకుని జడ్చర్ల నియోజకవర్గంలోని రాజాపూర్ మండలంలో బిజెవైఎం ఆధ్వర్యంలో భారీ ర్యాలి నిర్వహించారు. ఈ ర్యాలి లో బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు పాల్గొన్నారు. అనంతరం భారత మాజీ ఆర్మీ జవాన్లను సన్మానించారు. ఈ సందర్భంగా రామచంద్ర రావు మాట్లాడుతూ దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన భారత వీర జవాన్ల త్యాగాలను స్మరించుకుంటూ, దేశ సేవలో, రక్షణ కోసం సేవలందించిన మాజీ ఆర్మీ జవాన్లను సత్కరించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానన్నారు.ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, జిల్లా అధ్యక్షులు అలాగే ప్రతి బిజెవైఎం కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లోరామచంద్ర రావు మాట్లాడుతూ దేశ రక్షణ కోసం వీరోచితంగా పోరాడి, తమ పరాక్రమంతో పాకిస్తాన్ కు ముచ్చెమటలు పట్టించి, కార్గిల్ యుద్ధంలో భారత్ విజయం సాధించేందుకు వీరమరణం పొందిన అమరవీర జవాన్లకు మా ఘన నివాళులు అర్పించారు.1999లో కార్గిల్ ప్రాంతం నుంచి పాకిస్తాన్ ఉగ్రవాదులు మరియు చొరబాటుదారులు భారతదేశంలోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. ఇది భారతదేశంపై పాకిస్తాన్ చేసిన ఘోరమైన కుట్ర.ఈ దాడిని భారత సైన్యం ధైర్యంగా ఎదుర్కొంది. అప్పటి ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలో భారత సైన్యం ఓ మహత్తర విజయాన్ని సాధించింది. శత్రువులను తిప్పికొట్టి, కార్గిల్ లోని భారత భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది. ఈ యుద్ధంలో మన సైనికులు ప్రాణత్యాగాలు చేశారు. వారి ధైర్యం, వీరత్వం ఎప్పటికీ మరువలేనివి.ఈ రోజు దేశవ్యాప్తంగా కార్గిల్ విజయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ మరియు భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమాల ద్వారా ప్రజలకు మళ్లీ ఒకసారి భారత వీరజవాన్ల త్యాగాలను గుర్తు చేసుకుంటున్నాం. ఈ వేళ, చిన్నపిల్లలు కూడా పాల్గొంటూ దేశభక్తిని వ్యక్తపరుస్తున్నారు.భారత సైన్యం చేసిన త్యాగానికి గుర్తుగా, మనం జరుపుకుంటున్న కార్గిల్ విజయ దినోత్సవం భారత సైనిక వీరత్వానికి నిదర్శనం. ఇటీవల జరిగిన సర్జికల్ స్ట్రైక్‌లు, వైమానిక దాడులు, ఇతర ఆపరేషన్‌లు— ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికే.పాకిస్తాన్ మళ్లీ మామూలుగా దాడి చేయగలిగే స్థితిలో లేదు. కానీ పరోక్షంగా ఉగ్రవాదుల ద్వారా భారత్‌పై దాడులు చేస్తున్నాయి. కానీ ఈ దేశం ఇప్పుడు మారిపోయింది. సైనికులే కాదు..ఈ దేశపు ప్రతి యువకుడు, ప్రతి పౌరుడు దేశాన్ని రక్షించేందుకు సిద్ధంగా ఉన్నారు.ఈ కార్గిల్ విజయ దినోత్సవం మన యువతలో ఉత్సాహాన్ని, జాతీయతను పెంపొందించే అవకాశంగా ఉండాలన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం యువకుడిపై కత్తులు, రాళ్లతో దాడి సఖి సెంటర్ వద్ద...

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు కాకతీయ, ఖమ్మం: నగరంలోని కృష్ణవేణి కోపరేటివ్...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img