- కండువా కప్పి ఆహ్వానించిన ప్రణవ్
కాకతీయ, కరీంనగర్ : స్థానిక సంస్థల ఎన్నికల వేళ హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది. కమలాపూర్ మండలంలోని ఉప్పలపల్లి గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్, బీజేపీ నాయకులు కాంగ్రెస్ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ మేరకు ఆయన పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ఇంచార్జీ ప్రణవ్ తనదైన నాయకత్వ లక్షణాలతో పార్టీని, నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారని నాయకులు అన్నారు.


