- ఉప ఎన్నికపై రేవంత్‌రెడ్డి సమీక్ష
- ముగ్గురు మంత్రులకు దిశానిర్దేశం
- గెలుపు గుర్రాలకు అవకాశం ఇవ్వాలని ఆదేశం
కాకతీయ, తెలంగాణ బ్యూరో : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచితీరాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతోపాటు మనం చేసిన అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి ప్రచారం చేయాలని సూచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షించారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, పొన్నం ప్రభాకర్, వివేక్‌కు సూచించారు. గెలుపు గుర్రాన్ని నిలబెట్టాలన్న కోణంలోనే నివేదిక ఉండాలని స్పష్టంచేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అధిక శాతం స్థానాలు కైవసం చేసుకోవాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ కూడా మంత్రులతో ఈ అంశంపై చర్చించారు.


