epaper
Saturday, November 15, 2025
epaper

ఉగ్ర‌వాదానికి స‌పోర్టు పాకిస్థాన్ స‌పోర్ట్‌

ఉగ్ర‌వాదానికి స‌పోర్టు పాకిస్థాన్ స‌పోర్ట్‌
ఆ దేశానికి ఆప‌రేష‌న్ సింధూర్‌తో స్ప‌ష్ట‌మైన సందేశం ఇచ్చాం
ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ ఉపేంద్ర ద్వివేది

కాక‌తీయ‌, న్యూ ఢిల్లీ (జూలై 26): ఉగ్ర‌వాదానికి స‌పోర్టు ఇస్తున్న పాకిస్థాన్‌కు ఆప‌రేష‌న్ సింధూర్‌తో స్ప‌ష్ట‌మైన సందేశం ఇచ్చామ‌ని ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. కార్గిల్ యుద్ధ సంస్మ‌ర‌ణం సంద‌ర్భంగా ద్రాస్‌లో జ‌రిగిన విజ‌య్ దివ‌స్ కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడారు. ఆప‌రేష‌న్ సింధూర్ తో పాకిస్థాన్‌కు సందేశం ఇచ్చామ‌ని, అలాగే పెహ‌ల్గామ్ ఉగ్ర‌దాడికి ప్ర‌తిచ‌ర్య అని ఆయ‌న పేర్కొన్నారు. పెహ‌ల్గామ్ ఉగ్ర‌దాడి భార‌త్‌కు తీవ్ర గాయాన్ని ఏర్ప‌ర్చింద‌ని, అయితే ఈసారి ఇండియా బాధ‌ప‌డ‌డమే కాదు, ఆ చ‌ర్య‌కు ప్ర‌తీకార చ‌ర్య‌ను కూడా చూపించింద‌న్నారు. ఉగ్ర‌వాదాన్ని స‌హించేది లేద‌న్న సందేశాన్ని ఇచ్చామ‌న్నారు.కార్గిల్ యుద్ధ వీరుల‌ను స్మ‌రించేందుకు మూడు ప్రాజెక్టుల‌ను ఆర్మీ చీఫ్ ప్రారంభించారు. అమ‌రులకు నివాళి అర్పించేందుకు ఈ-శ్ర‌ద్ధాంజ‌లి పోర్ట‌ల్‌ను ఆయ‌న ప్రారంభించారు. 1999 నాటి కార్గిల్ యుద్ధ గాధ‌లు వినేందుకు క్యూఆర్ కోడ్ ఆడియో గేట్‌వేను కూడా ఆయ‌న ప్రారంభించారు. ప్ర‌తి ఏడాది జూలై 26వ తేదీన కార్గిల్ విజ‌య్ దివ‌స్‌ను సెల‌బ్రేట్ చేస్తున్న విష‌యం తెలిసిందే. కార్గిల్ యుద్ధ వీరుల స్మార‌కాన్ని విజిట్ చేయ‌కుండానే ప్ర‌జ‌ల త‌మ హీరోల‌కు ఈ-శ్ర‌ద్ధాంజ‌లి ప్ర‌క‌టించ‌వ‌చ్చు. ప్ర‌జ‌ల్లో ఆ నాటి యుద్ధ ప‌రిస్థితుల‌పై చైత‌న్యం తీసుకువ‌చ్చే ఉద్దేశంతో ఈ-శ్ర‌ద్ధాంజ‌లి ప్రారంభించారు.ఇండ‌స్ వ్యూవ్ పాయింట్ అనే ప్రాజెక్టును కూడా లాంచ్ చేశారు. దీని వ‌ల్ల విజిట‌ర్స్ ఎల్వోసీ వ‌ద్ద‌కు వెళ్ల‌వ‌చ్చు. బ‌టాలిక్ సెక్టార్‌లోని ఎల్వోసీ ప్రాంతాన్ని ఇండ‌స్ వ్యూవ్‌పాయింట్‌తో చూడ‌వ‌చ్చు. కార్గిల్ యుద్ధ స‌మ‌యంలో బ‌టాలిక్ ప్రాంతం కీల‌కంగా నిలిచింది. ఇది సుమారు ప‌ది వేల అడుగుల ఎత్తులో ఉంది. కార్గిల్‌, లేహ్‌, బ‌ల్టిస్తాన్ వ్యూహాత్మ‌క లొకేష‌న్‌లో ఉంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బీహార్‌లో ఎన్డీఏ క్లియర్ విక్టరీ.. గెలుపు రహస్యాలివే..!

బీహార్‌లో ఎన్డీఏ క్లియర్ విక్టరీ.. గెలుపు రహస్యాలివే..! కాక‌తీయ‌, జాతీయం: బీహార్ అసెంబ్లీ...

పీకే ప్రాజెక్ట్ బీహార్‌లో క్రాష్..!

పీకే ప్రాజెక్ట్ బీహార్‌లో క్రాష్..! పీకే అంచనాలను తారుమారు చేసిన ఓటర్లు పోస్టల్ బ్యాలెట్లలో...

డిసెంబర్ 6న ఆరు ప్రాంతాల్లో పేలుళ్లు.. దేశం వ‌ణికేలా జైష్ కుట్ర!

డిసెంబర్ 6న ఆరు ప్రాంతాల్లో పేలుళ్లు.. దేశం వ‌ణికేలా జైష్ కుట్ర! ఎర్రకోట...

ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్‌ గుట్టు రట్టు.. ఇమామ్ ఇర్ఫాన్ అరెస్ట్‌!

ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్‌ గుట్టు రట్టు.. ఇమామ్ ఇర్ఫాన్ అరెస్ట్‌! ఫరీదాబాద్ మాడ్యూల్...

ఢిల్లీ బ్లాస్ట్‌ కుట్రలో కొత్త మలుపు..

ఢిల్లీ బ్లాస్ట్‌ కుట్రలో కొత్త మలుపు..జనవరి 26న మరో దాడికి ప్లాన్..! దీపావళికే...

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఉద్రిక్తత కాకతీయ, హుజురాబాద్:...

జూబ్లీహిల్స్ హ‌స్త‌గ‌తం

జూబ్లీహిల్స్ హ‌స్త‌గ‌తం ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డించిన స‌ర్వే సంస్థ‌లు అన్నింట్లోనూ అధికార పార్టీకి స్పష్టమైన...

ఎన్‌డీఏదే బీహార్… మహాఘట్ బంధన్ పై దాదాపు 8.3 శాతం ఓట్ల ఆధిక్యం

ఎన్‌డీఏదే బీహార్ ప‌నిచేసిన ‘నిమో’ (నితీష్+మోదీ) ఫార్ములా ఎన్డీయే కూటమికి 46.2 శాతం ఓట్లు మహాఘట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img