కాకతీయ, కొత్తగూడెం రూరల్: పాల్వంచ మున్సిపల్ పరిధిలోని గాంధీ నగర్ ఐదో వార్డ్ లో అమ్మవారి మండపంలో బుధవారం మహా అన్నదానం నిర్వహించారు. గాంధీనగర్ లో ఎనిమిది సంవత్సరాలుగా దసరా ఉత్సవాలను నిర్వహిస్తున్నామని నిర్వాహకులు అన్నారు. అన్నదానంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో కేసు పాక వెంకటేశ్వర్లు, వెంకటేశ్వరరావు, ధారా నరసింహారావు, కొత్తపల్లి విజయ్, కోయిల శివ, లక్ష్మి, పద్మ, దుర్గ, కళ్యాణ్ , స్రవంతి తదితరులు పాల్గొన్నారు.


