కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : విజయదశమిని పురస్కరించుకుని బుధవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ సాయుధ దళ కార్యాలయంలో ఆయుధ పూజ నిర్వహించారు. ఈ మేరకు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆదేశాల మేరకు ఏ.ఆర్ డీఎస్పీలు శ్రీనివాస్, విజయప్రతాప్, టౌన్ డీఎస్పీ తిరుపతి రావు, అధికారులు సిబ్బందితో పాల్గొని ఆయుధాలు, వాహనాలకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో ప్రతీ సంవత్సరం దసరా పండగకు ముందు ఆయుధ పూజ నిర్వహించడం సాంప్రదాయంగా వస్తోందన్నారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి పండుగను జరుపుకోవడం సంతోషదాయకమన్నారు. సమాజంలో చెడును పారద్రోలేందుకు పోలీసు విభాగం నిరంతర కృషి చేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ పోలీస్ సిబ్బందికి, ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రూరల్ సీఐ సర్వయ్య, ఆర్ఐలు అనిల్, సోములు, భాస్కర్, నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు


