epaper
Monday, March 2, 2026
epaper

రేవంత్ ఎన్న‌డూ జై తెలంగాణ అన‌లే..

  • తెలంగాణ సోయిలేని ప్ర‌భుత్వం రాష్ట్రంలో ఉంది
  • స్థానిక ఎన్నిక‌ల్లో పోటీపై ఇంకా నిర్ణ‌యం తీసుకోలే…
  • అక్టోబర్ 8న కోర్టు తీర్పును బట్టి త‌మ కార్యాచరణ ..
  • తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : తెలంగాణ సోయిలేని ప్రభుత్వం రాష్ట్రంలో నడుస్తోంద‌ని, సీఎం రేవంత్ రెడ్డి ఎన్నడూ జై తెలంగాణ అనలేద‌ని తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత అన్నారు. ముఖ్య‌మంత్రి బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం విచిత్రంగా అనిపించింద‌ని, గిన్నిస్ బుక్ రికార్డుల కోసం పండుగ చేశార‌న్నారు. పదివేల మందితో బతుకమ్మ ఉత్స‌వాలు జ‌రిపి ప్రభుత్వం ఆడబిడ్డలను అవమానించింద‌ని మండిప‌డ్డారు. వచ్చే సంవత్సరం లక్షమంది మహిళలతో హైదరాబాద్‌లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుక‌లు ఘ‌నంగా నిర్వహిస్తామ‌న్నారు.

చింతమడక నుంచి లండన్ వరకు ఆదరించారు

చింతమడక నుంచి లండన్ వరకు తెలంగాణ ప్రజలు త‌నను ఆదరించార‌ని క‌విత అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీపై ఇంకా నిర్ణ‌యం తీసుకోలేద‌ని, అక్టోబర్ 8వ తేదీన కోర్టు తీర్పును బట్టి త‌మ కార్యాచరణ ఉంటుంద‌ని స్ప‌ష్టంచేశారు. విద్య, ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్లకు ఎలాంటి ఇబ్బందులు రావ‌ని, రాజకీయపరమైన రిజర్వేషన్లకు ఇబ్బంది వస్తుంద‌న్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి రేవంత్ రెడ్డి దగ్గరి మనుషులు కోర్టుల్లో కేసులు వేశార‌ని ఆరోపించారు.

ఈట‌ల వ్యాఖ్య‌లు వ్య‌క్తిగ‌త‌మా..?

బీసీ రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించాల్సిన బీజేపీ ఎన్నికలు జరిగితే కోర్టుల్లో క్యాన్సిల్ చేస్తామని అంటోంద‌న్నారు. ఈటెల రాజేందర్ ఎన్నికల్లో పోటీ చేయవద్దు అని అంటున్నార‌ని, బీజేపీ ఏమైనా కోర్టునా అన్నారు. ఈటెల రాజేందర్ బీసీ బిడ్డ, ఉద్యమకారుడు, ఎంపీగా ఎట్లా మాట్లాడతార‌న్నారు. ఈటెల మాటలు వ్యక్తిగతమా..బీజేపీ స్టాండా చెప్పాల‌న్నారు. గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉన్న ఆర్డినెన్స్ గురించి బీజేపీ మాట్లాడాల‌ని, ఢిల్లీ వెళ్లి మోడీ కాళ్ళు పట్టుకుని బీసీ రిజర్వేషన్లకు ఆమోదం తేవాల‌న్నారు. బీజేపీ తెలంగాణ బీసీలకు క్షమాపణ చెప్పాల‌న్నారు. రాష్ట్రంలో ఉన్న బీసీ బిడ్డలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమ‌న్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజల ఆస్తి

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఊహించనిదని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలతో ప్రజల జీవితాల్లో మార్పులు రావ‌న్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజల ఆస్తి అని, మేడిగడ్డ బ్యారేజీ రిపేర్ చేయాలని తెలంగాణవాదులు అంతా కోరుకున్నార‌ని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కాలయాపన చేసి ప్రజలను ఇబ్బందులు పెడుతోంద‌న్నారు. రైతులకు యూరియా సైతం సరఫరా చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంద‌ని క‌విత విమ‌ర్శించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా?

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా? పీహెచ్‌డీలు లేకుండా విద్యా విధానం ఎలా? అర్హతలేని కమిటీతో...

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం”

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం” ప్రజలు ఆకలిని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img