కాకతీయ, తెలంగాణ బ్యూరో: ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేట్ కాలేజీలు మరోసారి సమ్మెకు సిద్ధం అవుతున్నాయి. నేడు అత్యవసర సమావేశం నిర్వహించిన కాలేజీల యాజమాన్యాలు భవిష్యత్ కార్యాచరణపై చర్చించాయి. సమావేశం తర్వాత ఎఫ్ ఏటీహెచ్ఐ చైర్మన్ రమేశ్ మీడియాతో మాట్లాడారు.
ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు ప్రభుత్వం రిలీజ్ చేయలేదు. ప్రభుత్వానికి విద్యారంగం ఆఖరి ప్రాధాన్యతను ఇస్తుంది. గత నెల 21, 22 తేదీల్లో రూ. 600కోట్లు ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. అయినప్పటికీ బకాయిలు చెల్లించలేదు. కేవలం రూ. 200కోట్లు మాత్రమే విడుదల చేశారు. దీపావళిలోపు రూ. 1200కోట్లు ఇస్తామన్నారు. ఎలా ఇస్తారో చెప్పాలి. ఈ నెల 12లోపు బకాయిలు చెల్లించకుంటే…13 నుంచి సమ్మెకు వెళ్తాం. నేటి నుంచి సీఎంవో కార్యాలయంతో తప్ప మరెవరితో చర్చించం. అవసరం అయితే విద్యార్థులతో కలిసి ఛలో హైదరాబాద్ చేపడతామని వివరించారు.


