కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణ శివారులోని 132 కేవీ సబ్‌స్టేషన్‌లో దుర్ఘటన చోటు చేసుకుంది. ఆర్టీజియన్ గ్రేడ్-2 అసిస్టెంట్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న బోడ శంకర్ రెడ్డి (40) ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందారు. మండలంలోని రంగాపూర్ గ్రామానికి చెందిన శంకర్ రెడ్డి బుధవారం సబ్‌స్టేషన్ (బోర్ణపల్లి)లో పనులు చేస్తుండగా విద్యుత్ స్తంభంపై ఎక్కిన క్రమంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా తీవ్ర షాక్‌కు గురై అక్కడికక్కడే మరణించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆర్టీజియన్ ఉద్యోగి అకాల మరణంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై సంబంధిత అధికారులు విచారణ జరుపుతున్నారు.
హుజురాబాద్‌లో విద్యుత్ షాక్‌తో ఉద్యోగి మృతి..!!
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


