గంజాయి స్వాధీనం….ముగ్గురు వ్యక్తులు అరెస్ట్
– ద్విచక్ర వాహనంపై గంజాయి తరలింపు
– 183 గ్రాముల గంజాయి,మూడు సెల్ ఫోన్లు స్వాధీనం
– వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో ఘటన
కాకతీయ, రాయపర్తి :
ద్విచక్ర వాహనంపై గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని బస్టాండ్ ఆవరణంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.ద్విచక్ర వాహనంపై అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు వ్యక్తుల నుండి 183 గ్రాముల గంజాయి,మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వర్ధన్నపేట సీఐ కొమ్మూరి శ్రీనివాస్,ఎస్ఐ ముత్యం రాజేందర్ తెలిపారు.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


