- గంగారం గడ్డ ఎప్పుడూ కాంగ్రెస్ అడ్డానే
- మండల అధ్యక్షులు జాడి వెంకటేశ్వర్లు
కాకతీయ , మహబూబాబాద్ ప్రతినిధి : మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం జడ్పీటీసీ స్థానానికి రిజర్వేషన్ దామాషా ప్రకారం జనరల్ కి కేటాయించారు. దీంతో మానుకోట జడ్పీ పీఠంపై రెడ్ల కన్నేసిన రెడ్డి సామజిక వర్గం గంగారం నుంచి బరిలోకి దిగే అవకాశాలున్నాయనే కథనంతో కాకతీయ పత్రిక ప్రచురించంగా జిల్లా హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయమై గంగారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జాడి వెంకటేశ్వర్లు మంగళవారం స్పందించారు. స్థానిక నాయకత్వానికే తప్పా, వలస వచ్చే నాయకులకు తమ ప్రాంతంలో పోటీ చేసే అవకాశం లేదని స్పష్టం చేశారు.
పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో మహబూబాబాద్ జిల్లాలో అన్ని చోట్ల జడ్పిటిసి, ఎంపిటిసి లను గెలుపొందినప్పటికీ , గంగారంలో మాత్రం ఆ అవకాశం వారికివ్వలేదన్నారు. మండలంలో యే ఒక్క సీటు బీఆర్ ఎస్ కు దక్కకుండా పటిష్ఠమైన కాంగ్రెస్ నాయకత్వంలో పని చేశామని గుర్తు చేశారు. రాబోవు జడ్పీటీసీ ఎన్నికలలో సైతం కాంగ్రెస్ జెండాని గంగారం గడ్డపై రెపరెపలాడించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వలసవచ్చి పోటీచేసే నాయకులకు ఏ మాత్రం అవకాశం ఉండదని నొక్కి చెప్పడం గమనార్హం. ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి పరిస్థితులు రానివ్వమంటూ తమ ప్రాంతంలో పోటీ పేరిట గందరగోళం సృష్టించవద్దని ఆయన కోరారు.


