జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్
కాకతీయ, మంచిర్యాల : పంచాయతీ ఎన్నికల నిర్వహణ జిల్లాలో స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా జరిగే విధంగా అధికారులు విధులు నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ప్రాదేశిక ఎన్నికలు రెండు విడతలలో, సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికలు మూడు విడతలలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి జిల్లాలో పకడ్బందీగా అమలు చేసేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్ట్రాంగ్ రూమ్, బ్యాలెట్ బాక్స్, బ్యాలెట్ పేపర్ ఇతర ఎన్నికల సంబంధిత ప్రతి అంశంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రత్యేక అధికారులను నియమించామని, పెయిడ్ న్యూస్ సంబంధించి ప్రత్యేకంగా పర్యవేక్షించి సంబంధిత రాజకీయ పార్టీ/అభ్యర్థి ఖాతాలో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. ఓటర్లను ప్రభావితం చేసే అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి ఎన్నికల ప్రవర్తన నియమావళి ఖచ్చితంగా అమలు చేయడం చేస్తామన్నారు.


