కాకతీయ, తెలంగాణ బ్యూరో : దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ తల్లి ఆలయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు కేటీఆర్ దంపతులు. మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ఆహ్వానం మేరకు ఆలయానికి విచ్చేసిన కేటీఆర్ దంపతులను అర్చకులు ఆశీర్వదించి, తీర్థప్రసాదాలు అందజేశారు. కేటీఆర్ వెంట మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులు ఉన్నారు.
పెద్దమ్మతల్లిని దర్శించుకున్న కేటీఆర్ దంపతులు
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


