- ఆపరేషన్ సింధూర్ ఇందుకు ఉదాహరణ
- రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
కాకతీయ, నేషనల్ డెస్క్ : ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీల మధ్య సమన్వయం ఎంతో కీలకమఇ, మారుతున్న యుద్ధరీతులకు అనుగుణంగా అన్ని విభాగాలు కలిసి పనిచేయాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. త్రివిధ దళాలను ఉద్దేశించి ఢిల్లీలో ఆయన మాట్లాడారు. త్రివిధ దళాల అద్భుత కలయికకు ఆపరేషన్ సింధూర్ ఓ ఉదాహరణ అని చెప్పారు. మన భద్రతా దళాలు ఎన్నో సంవత్సరాల అనుభవంతో వ్యవస్థలను అభివృద్ధి చేశాయన్నారు. ప్రస్తుత కాలంలో ఇవన్నీ అనుసంధానమై ఉండటం ముఖ్యమన్నారు. విడివిడిగా పనిచేయడం వల్ల నిర్ణయం తీసుకోవడం సవాల్‌గా మారుతుందన్నారు.
సమగ్ర వ్యవస్థ సైన్యం విశ్వాసాన్ని పెంచుతుందని తెలిపారు. నేటి ప్రపంచంలో మనం సైబర్ దాడులు, సమాచార యుద్ధ ముప్పును ఎదుర్కొంటున్నామన్నారు. దీంతో త్రివిత దళాల పనిని సమన్వయం చేసే వ్యవస్థను అభివృద్ధి చేసుకోవాలని ఆయన సూచించారు. ఇతర దేశాల నుంచి ఉత్తమ పద్ధతులను అందిపుచ్చుకోవాలని.. అదే సమయంలో ప్రతి దేశానికి కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటాయన్నారు. వాటి ఆధారంగానే పరిష్కారాలు ఉండాలని మంత్రి రాజ్‌నాథ్ వెల్లడించారు.


