- వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్
కాకతీయ, హనుమకొండ : వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ నాయకత్వంలో బీజేపీలోకి భారీగా చేరికలు జరిగాయి. మంగళవారం వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, హనుమకొండ మాజీ ఎమ్మెల్యే ధర్మారావు సమక్షంలో, ఐనవోలు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు చెందిన సుమారు 50 మంది కార్యకర్తలు బీజేపీ పార్టీ కండువా కప్పుకున్నారు.
కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రజల కోసం అమలు చేస్తున్న పథకాలతో ఆకర్షితులై బీజేపీపై నమ్మకంతో చేరారని వారు తెలిపారు. ప్రతి కార్యకర్తను కాపాడుకుంటూ, వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ప్రణయ్, ఉపాధ్యక్షుడు తాటికాయల ఆనందం, మండల సెక్రటరీ ఆడెపు విక్రమ్, శక్తికేంద్ర ఇంచార్జ్ వెంకటేష్ గౌడ్, నరసింహ గౌడ్, యువ మోర్చా అధ్యక్షుడు పులి సాగర్ తదితరులు పాల్గొన్నారు.


