- 139 కేంద్రాలు.. 407 పోలింగ్ స్టేషన్లు ..
- జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం తుది ఓటర్ల జాబితా విడుదల
- వివరాలు వెల్లడించిన హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్
కాకతీయ, తెలంగాణ బ్యూరో : జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించిన తుది ఓటర్ల జాబితా విడుదలైంది. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 3,98,982 మంది ఉన్నారని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ వెల్లడించారు. 2,07,382 మంది పురుషులు, 1,91,593 మంది మహిళలు, 25 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నారు. లింగ నిష్పత్తి ప్రతి వెయ్యి పురుషులకు 924 మహిళలుగా ఉందని తెలిపారు.
కొత్త ఓటర్లు ఆరు వేలు..
సెప్టెంబర్ 2వ తేదీన విడుదల చేసిన ప్రాథమిక జాబితాలో 3,92,669 ఓటర్లు ఉన్నారు. సవరణల తరువాత 6,976 మంది కొత్తగా చేరారు. 663 మందిని తొలగించారు. దీంతో మొత్తం ఓటర్ల సంఖ్య 3,98,982కి చేరింది. సేవా ఓటర్లను కలుపుకుంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తుది ఓటర్ల సంఖ్య 3,99,000గా ఉంది. దాదాపు నాలుగు లక్షలకు చేరువగా ఉన్న ఓటర్లకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక నిర్వహణకు 139 కేంద్రాల్లో 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు.


