కాకతీయ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలో చట్టవిరుద్ధంగా వెలస్తున్న అడ్వర్టైసింగ్ బోర్డుల ఏర్పాటు పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సీఎంకు అత్యంత సన్నిహితుడు ఈ మాఫీయాను నడిపిస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఈ మాఫియా చట్ట విరుద్ధంగా అడ్వర్టైసింగ్ బోర్డులు ఏర్పాటు చేసి లక్షలు వెనసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఇదే విషయాన్ని ఓ మహిళ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించింది. వాటికి పర్మిషన్ ఉన్నాయా..పర్మిషన్ ఉంటే మాకు కూడా ఇవ్వండని జీహెచ్ఎంసీ అధికారులను అడ్వర్టైసింగ్ ఏజెన్సీ మహిళా ప్రశ్నించింది. మేము అడిగితే మాత్రం జీవో 68 అని చెబుతారు.. మరి వీళ్లందరూ ఎలా పెడుతున్నారంటూ ప్రశ్నించింది. ఫ్లైఓవర్ల మీద అడ్వర్టైసింగ్ బోర్డులు తొలగించనట్లయితే..దీని వెనకాల ఉన్న ముఠా పేరు బయటపెడతానంటూ ఆ మహిళా హెచ్చరించింది.
GHMC పరిధిలో చట్టవిరుద్ధంగా అడ్వర్టైసింగ్ బోర్డులు ఏర్పాటు.. పట్టించుకోని అధికారులు
అక్రమంగా లక్షల్లో వెనకేసుకుంటున్న ముఠా
సీఎంకు అత్యంత సన్నిహితుడు నడిపిస్తున్న మాఫియాగా గుర్తింపు
ఫిర్యాదులు చేసినా పట్టించుకోని వైనం
వాటికి పర్మిషన్ ఉన్నాయా.. పర్మిషన్ ఉంటే మాకు కూడా ఇవ్వండి… pic.twitter.com/HGQhoF71Up
— Telugu Scribe (@TeluguScribe) September 30, 2025


