కాకతీయ, నేషనల్ డెస్క్: ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ఆర్థిక అంశాలపై చర్చలు జరిగినట్లు సమాచారం. ముఖ్యమంత్రితో పాటు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి పయ్యావుల కేశవ్, పలువురు ఎంపీలు కూడా పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, నిధుల మంజూరు వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయని అధికార వర్గాలు వెల్లడించాయి.
CM Chandrababu: నిర్మలా సీతారామన్‌తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ..!!
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


