స్వదేశ స్వాభిమానాన్ని చాటండి .
ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత ప్రముఖు శ్రీ రాంప్రసాద్.
కాకతీయ, బయ్యారం ః
కులం ,మతం, పార్టీలు వేరైనా మనమంతా భారతీయులం, మన దేశంలో మన స్వదేశి స్వాభిమానాన్ని చాటాలని ఆర్ ఎస్ ఎస్ తెలంగాణ ప్రాంత సీనియర్ సంచాలకులు శ్రీ రాంప్రసాద్ అన్నారు. మంగళవారం ఆర్ఎస్ఎస్ శత దినోత్సవంను పురస్కరించుకొని, మండల కేంద్రంలోని రామాలయం నుండి బస్టాండ్ సెంటర్ మీదుగా, గాంధీ సెంటర్ నుండి రామాలయం వీధి వరకు బయ్యారం ఆర్ఎస్ఎస్ సీనియర్ సంచాలకులు నాయిని ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీ రాంప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ దేశంలో ఎన్నో విచ్ఛిన్నకర శక్తులు ఉన్న హిందూ బంధువులు సంఘటితమై స్వదేశ అభిమానాన్ని చాటారని అన్నారు 1925లో హెగ్డే ఆర్ఎస్ఎస్ సంఘాన్ని స్థాపించి దేశం నలుమూలల విస్తరింప చేశారని , దేశంలో మత ,కుల ప్రాంతీయ పార్టీలు విద్వేషాలు రెచ్చగొట్టినా చెక్కు చెదరలేదని, మనమంతా భారతీయులమనే సంఘటితంగా పోరాట చేయడం వలన, మన భారతదేశం ఐక్యంగా ఉందని గుర్తు చేశారు.ఆర్ఎస్ఎస్ ఏర్పడి 100 సంవత్సరాలు అయిన సందర్భంగా,భారత మాత, ఆర్ ఎస్ ఎస్ కర్త హెగ్డే చిత్రం పాఠం వద్ద ఆయుధ పూజ ,జమ్మి పూజలు నిర్వహించారు.ఆర్ఎస్ఎస్ జెండా ఎగురవేశారు.ధ్వజారోహణం చేసీ నమస్తే సదా వత్సలే…గీతాన్ని ఆలపించారు. వన్నం రామారావు భారత జాతీయ సమైక్యతకు, హిందూ సంఘటితం , సాంస్కృతిక ంనకు సంబంధించిన గీతాన్ని ఆలపించి ఉత్తేజ పరిచారు.ఈ కార్యక్రమంలో బయ్యారం గార్ల ఇల్లెందు ఆర్ఎస్ఎస్ ఇన్చార్జి భూక్యా రాంబాబు, గ్రామ ఆర్ ఎస్ ఎస్ సంచాలకులు బిజ్జ కనకయ్య ,గోపాల్ ,పృద్వి ఇస్కాన్ ,భూక్యా రాజు, వెంకన్న మహేష్ ,తదితరులు పాల్గొన్నారు


