బాధిత కుటుంబాన్ని పరామర్శ.
కాకతీయ, పెద్దవంగర :
మండలంలోని పడమటితండాకు చెందిన దారావత్ బిక్నా నాయక్ ఆనారోగ్యంతో మంగళవారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మండల కాంగ్రెస్ నాయకులు బిక్నానాయక్ మృత దేహంపై పూలమాలలు వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ముద్దసాని సురేష్, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి జానీ పాషా,నాయకులు బానోత్ సోమన్న,ధరావత్ రమేష్, సుధాకర్, కృష్ణ, సుమన్, మురళి, బోడియా, పుణ్య నాయక్, పంతులు నాయక్, సీనియర్ నాయకులు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.


